Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 8:28 am Posted by : kasaramkrushna@gmail.com

ఘనంగా శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవం

 కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కత్తి కార్తిక గౌడ్

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 28(వార్త సంధ్య ):దుబ్బాక మండలం రఘుత్తంపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజల్లో పాల్గొని, శ్రీ బీరప్ప కామరాతి దేవుళ్ల ఆశీస్సులు స్వీకరించారు. గ్రామ ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ లక్ష్మీనారా గౌడ్, గణేష్, పరుశురామ్, శ్రీ మల్లికార్జున కూర్మ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.