అడవిలో ఎలుగుబంటి దాడి: వ్యక్తికి తీవ్ర గాయాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 24 (వార్త సంధ్య):కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట తండా శివారులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అడవిలో కట్టెల కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.శుక్రవారం ఉదయం స్కూల్ తండాకు చెందిన సలావత్ మత్తు (45) తన భార్యతో కలిసి అడవికి కట్టెల కోసం వెళ్లారు. కట్టెలు కొట్టుకుని పక్కనపెట్టిన తర్వాత కొన్ని కట్టలను రోడ్డుకు తీసుకెళ్లి వస్తానని భార్య అక్కడి నుంచి వెళ్లింది. ఈ సమయంలో అడవిలో ఒంటరిగా ఉన్న మత్తుపై ఒక్కసారిగా...