అక్రమ నిర్మాణదారుల పాలిట టీపీఎస్ అర్చన భజన!

ఎల్బీనగర్ సర్కిల్‌–13లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట ఎక్కడ? నోటీసులు ఇచ్చి వదిలేస్తున్నారా.. తదుపరి చర్యలు ఏవీ? అక్రమ నిర్మాణాలపై ప్రశ్నిస్తే జర్నలిస్టునే ప్రశ్నిస్తారా?  ఎల్బీనగర్, వార్తసంధ్య ప్రతినిధి: ఎల్బీనగర్ సర్కిల్‌–13 పరిధిలో అక్రమ నిర్మాణాలు, అనుమతులకు మించి చేపడుతున్న భవనాలు, అనధికార షెడ్ల వ్యవహారంపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగం పరిధిలో నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న టీపీఎస్ అర్చన పనితీరుపై స్థానికులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భవన యజమానులపై అధికారులు ఎలాంటి చర్యలు...