పెద్ద చీకోడ్‌లో అంగన్వాడీ లబ్దిదారులకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ
చిన్నారులు, గర్భిణీలకు పోషకాహార సరఫరా వేసవి నేపథ్యంలో ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన దుబ్బాక, వార్త సంధ్య, మే 06: దుబ్బాక మండలం కేంద్రంలోని పెద్ద చీకోడ్ గ్రామంలో అంగన్వాడీ లబ్దిదారులకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొమిరే నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు అవసరమైన పోషకాహార పదార్థాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం మరియు పాలు అందజేశారు....