హైకోర్టు ఆదేశాలకే టౌన్ ప్లానింగ్ అధికారుల తిలోదకాలు?
రిట్ పిటిషన్లు కొనసాగుతున్నా నిర్మాణ పనులు యథేచ్ఛగా.. పూర్తిచేసి వినియోగంలోకి తెస్తున్నా పట్టించుకోని అధికారులు? అక్రమ నిర్మాణాలపై ప్రజల ఫిర్యాదులు బుట్టదాఖలు.. కోర్టు పరిధిలోని నిర్మాణాలపైనా మౌనం ఎందుకు? అమీర్‌పేట సర్కిల్‌లో డీసీ, ఏసీపీ, సెక్షన్ అధికారుల బాధ్యతారాహిత్యంపై చర్యలు ఎప్పుడు? హైదరాబాద్, తేదీ (వార్త సంధ్య): గ్రేటర్ హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజలు ఫిర్యాదులు చేసినా స్పందన కనిపించడం లేదని ఆరోపణలు రావడం ఒకవైపు కాగా,...