రంగారెడ్డి విద్యాశాఖలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలి: AIMIM
రంగారెడ్డి విద్యాశాఖలో అక్రమాలపై సమగ్ర విచారణ కోరిన AIMIM రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ బాబు చొల్లేటి హైదరాబాద్, జూలై 21 (వార్త సంధ్య): రంగారెడ్డి జిల్లా విద్యాశాఖలో ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు, రిపాట్రియేషన్లు, బదిలీల వ్యవహారంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై స్వతంత్రంగా, సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని AIMIM (ఇంక్విలాబ్-ఎ-మిల్లత్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ బాబు చొల్లేటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు సమగ్ర ఫిర్యాదు సమర్పించినట్లు ఆయన తెలిపారు....