కొత్తపేటలో అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 14వ శాఖ ప్రారంభం
ఆధునిక బ్యాంకింగ్ సేవలు ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యం నాగోల్, ఆగస్టు 2 (వార్త సంధ్య): నగరంలోని దిల్‌సుఖ్‌నగర్–కొత్తపేట ప్రాంతంలో అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ 14వ శాఖను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావధి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక బ్యాంకింగ్ సేవలను ప్రతి వినియోగదారుడికి చేరువ చేయాలనే లక్ష్యంతో అగ్రసేన్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తన సేవలను విస్తరిస్తోందని తెలిపారు. వినియోగదారులకు...