ఐఎల్పీఏ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా న్యాయవాది సుంకర భానుప్రియ.
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 26 (వార్త సంధ్య) : ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్ కు చెందిన మహిళా న్యాయవాది సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగపూర్‌లో జరిగిన జాతీయ మహాసభలో ఈ ఎన్నికలు నిర్వహించగా, జాతీయ కౌన్సిల్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షురాలిగా సుజాత చౌదంతే, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.జే. సామ్సన్, కార్యవర్గ సభ్యురాలిగా సుంకర భానుప్రియ ను ఎన్నుకున్నారు. జ్యోతిరావు...