Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 26 April 2026, 6:16 pm Posted by : జడల నాగప్రసాద్

ఐఎల్పీఏ జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా న్యాయవాది సుంకర భానుప్రియ.

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 26 (వార్త సంధ్య) : ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) జాతీయ కౌన్సిల్ సభ్యురాలిగా కొత్తగూడెం బార్ అసోసియేషన్‌ కు చెందిన మహిళా న్యాయవాది సుంకర భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాగపూర్‌లో జరిగిన జాతీయ మహాసభలో ఈ ఎన్నికలు నిర్వహించగా, జాతీయ కౌన్సిల్‌ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షురాలిగా సుజాత చౌదంతే, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.జే. సామ్సన్, కార్యవర్గ సభ్యురాలిగా సుంకర భానుప్రియ ను ఎన్నుకున్నారు. జ్యోతిరావు పూలే, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలతో స్థాపించబడిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) న్యాయవాదుల అభ్యున్నతి, సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోందని భానుప్రియ తెలిపారు. అలాగే అణగారిన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందేలా, సమానత్వం మరియు సమాన అవకాశాలు కల్పించే సమసమాజ నిర్మాణం లక్ష్యంగా బిఎఎంసిఈఎఫ్ కు అనుబంధంగా సంస్థ పనిచేస్తోందని వివరించారు. “పే బ్యాక్ టు సొసైటీ” లక్ష్యంతో పనిచేస్తున్న ఐఎల్పీఏ లో అందరూ సభ్యులుగా చేరి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. భానుప్రియ ఎన్నిక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జాతీయ స్థాయిలో మరింత గౌరవం తీసుకువచ్చిందని ఐఎల్పీఏ తెలంగాణ రాష్ట్ర నాయకులు జనపరెడ్డి గోపికృష్ణ, మారపాక రమేష్, మహమ్మద్ సాదిక్ పాషా, డి. సామంత్, యెర్రా కామేష్, యెర్రాపాటి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు.