ఆదిభట్ల అక్రమ నిర్మాణాలు!
కార్పొరేషన్ నిబంధనలకు బేఖాతర్ నోటీసులు ఇచ్చినా ఆగని పనులు.. అధికారుల వైఖరిపై అనుమానాలు చర్యల పేరుతో కాలయాపన చేస్తున్నారా? రంగారెడ్డి, ఆగస్టు 19 (వార్త సంధ్య): ఆదిభట్లలో అక్రమ నిర్మాణాలపై స్థానికుల ఆందోళన కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ పనులు రోజురోజుకూ కొనసాగుతున్నా అధికారులు కేవలం నోటీసులతోనే సరిపెడుతున్నారని విమర్శిస్తున్నారు. అక్రమ నిర్మాణాల కారణంగా ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు...