ఎమ్మార్వో సంతకానికే రెక్కలు.. భూమికీ రెక్కలు!

రూ.50 కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేట్‌ ఖాతాలోకి..? సర్వే నంబర్‌ 96లో 4.36 ఎకరాలపై అనుమానాల మబ్బులు పట్టా ఎలా వచ్చింది..? ఫోర్జరీ సంతకం వెనుక ఎవరు..? హైదరాబాద్‌/ ఆదిభట్ల , అక్టోబర్‌ 2 (వార్త సంధ్య): ప్రభుత్వ భూములపై భూ మాఫియా కన్ను పడిందా..? కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు రికార్డుల్లో మార్పుల ద్వారా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయా..? లేక రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పుల వెనుక మరేదైనా ప్రక్రియ ఉందా..? ప్రస్తుతం ఆదిభట్ల పరిధిలోని ఓ భూ వ్యవహారం ఈ...