ఏసీబీ వలలో చిక్కిన చైతన్యపురి ఏఎస్సై – రూ.15 వేల లంచం డిమాండ్

హైదరాబాద్, ఏప్రిల్ 1 (వార్త సంధ్య):మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. మహిళా వేధింపుల కేసును లోక్ అదాలత్ ద్వారా ముగించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల ప్రకారం, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం. 363/2025లో పల్లపు రాంబాబు పై మహిళా వేధింపుల కేసు నమోదు అయింది. అనంతరం ఈ కేసు కాంప్రమైజ్ అయిన...