డా. పైడి ఎల్లారెడ్డికి ప్రతిష్టాత్మక జపాన్ పర్యటనకు ఆహ్వానం తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవం ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. పైడి ఎల్లారెడ్డి గారికి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవకాశం లభించింది. గ్రామీణ మూలాలను మరిచిపోకుండా సమాజ హితం కోసం నిరంతరం కృషి చేస్తూ, శాస్త్ర సాంకేతిక రంగం మరియు ప్రజా జీవితంలో విశేష సేవలందిస్తున్న ఆయన మరోసారి తెలంగాణ కీర్తిని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో...