8వ రోజు విజయవంతంగా కొనసాగిన ఎస్‌ఐఆర్

భద్రాద్రి, జూలై 02 (వార్త సంధ్య) : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్ కమ్యూనిటీ హాల్‌లో గురువారం నాడు ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సీ రివిజన్) కార్యక్రమం 8వ రోజూ విజయవంతంగా కొనసాగినట్లు జీపీఓ పావని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని చెప్పారు. ఓటరు నమోదు, వివరాల సవరణ, అవసరమైన పత్రాల సమర్పణకు సంబంధించిన సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేస్తూ, ప్రతి ఒక్కరికీ సులభంగా అర్థమయ్యేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర...