Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 08 June 2026, 9:42 am Posted by : జడల నాగప్రసాద్

60వ డివిజన్‌లో నేడు గ్రామ సభ…!

కొత్తగూడెం, జూన్ 08 (వార్త సంధ్య) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం 60వ డివిజన్‌లో గ్రామ సభ నిర్వహించనున్నట్లు కార్పొరేటర్ భీమ శ్రీవల్లి తెలిపారు. డివిజన్ పరిధిలోని ధామరకొండ మల్లయ్య ఇంటి సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో, కార్పొరేషన్ అధికారుల సమక్షంలో ఈ గ్రామ సభ జరగనుంది. ఈ సందర్భంగా డివిజన్‌కు సంబంధించిన అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, రహదారులు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు తదితర ప్రజా సమస్యలపై చర్చించి, స్థానిక ప్రజల నుండి సూచనలు, వినతులు స్వీకరించనున్నారు. అందువల్ల డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని 60వ డివిజన్ కార్పొరేటర్ భీమ శ్రీవల్లి కోరారు.