2బిహెచ్‌కే ఇండ్లలో నివాసం లేకుంటే రద్దు: కలెక్టర్ సి. నారాయణ రెడ్డి హెచ్చరిక

మార్చి 31లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి కేటాయించిన ఇండ్లలో తప్పనిసరిగా నివాసం ఉండాలని సూచన మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులకు ఆదేశాలు రంగారెడ్డి జిల్లా, మార్చి 17 (వార్త సంధ్య):డబుల్ బెడ్ రూమ్ (2బిహెచ్‌కే) ఇండ్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా తమకు కేటాయించిన ఇండ్లలో నివాసం ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సూచించారు. ఇప్పటికే ఇండ్లు కేటాయించబడినప్పటికీ నివాసం ఉండని వారి ఇండ్లను నోటీసులు జారీ చేసి రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో...