13వ రోజు విజయవంతంగా ముగిసిన ఎస్‌ఐఆర్ కార్యక్రమం

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 06 (వార్త సంధ్య) : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ సఫాయి బస్తిలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం 13వ రోజు కూడా విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఏ పద్మ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించని అర్హులైన ఓటర్లకు ఫారాలు నింపించి, అవసరమైన వివరాలను నమోదు చేయించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎవరూ మిగిలిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు పర్యవేక్షించగా,...