Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:21 am Posted by : జడల నాగప్రసాద్

13వ రోజు విజయవంతంగా ముగిసిన ఎస్‌ఐఆర్ కార్యక్రమం

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 06 (వార్త సంధ్య) : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ సఫాయి బస్తిలో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం 13వ రోజు కూడా విజయవంతంగా, ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఏ పద్మ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దరఖాస్తులు సమర్పించని అర్హులైన ఓటర్లకు ఫారాలు నింపించి, అవసరమైన వివరాలను నమోదు చేయించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎవరూ మిగిలిపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు పర్యవేక్షించగా, గ్రామ రెవెన్యూ అధికారి పావని పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక మహిళలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొని ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయడంలో సహకరించారు. ప్రజలు తమ ఓటు హక్కును సక్రమంగా నమోదు చేసుకోవాలని, అవసరమైన పత్రాలతో ముందుకు రావాలని అధికారులు సూచించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుండటంతో స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు.