Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 4:02 pm Posted by : sairamkodipyaka7@gmail.com

హైదరాబాద్‌ లో టీఆర్‌ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 3 ( వార్త సంధ్య )

 

హైదరాబాద్‌లోని సురభి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6 ఆగస్టు 2026, ఉదయం 10.00 గంటలకు టీఆర్‌ఎస్ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో “సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ” నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సామాజిక సంఘాల ప్రతినిధులు సభకు హాజరుకానున్నట్లు తెలిపారు.

 

తెలంగాణలో సామాజిక న్యాయం, యువత సాధికారత, వెనుకబడిన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర హక్కుల పరిరక్షణ వంటి ముఖ్య అంశాలపై ఈ సభలో విస్తృతంగా చర్చ జరగనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

 

సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నిర్వాహకులు కోరారు. కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు.

 

కార్యక్రమ వివరాలు

 

– వేదిక: సురభి నగర్ ఇండోర్ స్టేడియం, హైదరాబాద్

– సమయం: ఉదయం 10.00 గంటలు

– తేదీ: 06-08-2026

 

జై తెలంగాణ – తెలంగాణ రక్షణ సేన