
తేదీ : 21/7/2026 వార్త సంధ్య ప్రతినిధి
మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ప్రజా సంక్షేమం కోసం పాటుపడి విశిష్ట సేవలు అందించిన రాజకీయ ఉద్దండులకు అవార్డులను ప్రధానం చేసి సత్కరించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది “లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ”. ఈ సంస్థ ద్వారా “స్టేట్స్ మెన్ ఎక్స్ లెన్స్” అవార్డు పేరుతో 65ఏళ్ళ పైబడిన ఎంపిక చేసిన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించిన నాయకులకు అవ్వార్థులు ప్రధానం చేయనున్నారు.
ఈనెల 25 వ తేదీన లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో స్టేట్స్ మెన్ ఎక్స్ లెన్స్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన కాంక్లెవ్ నిర్వహించనున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ ను సోమాజిగూడ లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీ విజయకుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన పోస్టర్ ను ఆవిష్కరించారు. విశిష్ట అతిధులుగా మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, హైడ్రా పిఆర్ఓ శ్రీ వేణుగోపాల్ నాయుడు గారు మరియు తెలంగాణ మాస పత్రిక ఎక్సిక్యూటివ్ ఎడిటర్ శ్రీ కోడూరి శ్రీనివాస్ రావ్ గారు పాల్గొన్నారు. ప్రత్యేక అతిధిగా సీనియర్ పాత్రికేయులు మరియు మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయ్ బాబు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ రాజకీయ నాయకులకు అవార్డులు ప్రధానం చేయడం శుభసూచకమని, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు. ఇంతటి సాహసోపేతమైన కార్యక్రమానికి పూనుకున్న లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శివాల గిరిబాబు గారిని అతిధులు అభినందించారు. అదే విధంగా లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ క్రియేటివ్ డైరెక్టర్ సుధాజైన్ గారు, నిర్వహణ కమిటీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు మరియు కార్యనిర్వహణ హెడ్స్ నాగేష్, చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.