స్నేహం.. జీవితానికి శాశ్వత బలం
నేడు ప్రపంచ స్నేహితుల దినోత్సవం ప్రత్యేకం నాగప్రసాద్ జిల్లా బ్యూరో, ఆగస్టు 02 (వార్త సంధ్య) : మనిషి జీవితంలో కుటుంబ సభ్యుల తర్వాత అత్యంత విలువైన బంధం స్నేహం. రక్తసంబంధం కాకపోయినా హృదయాలను కలిపే స్వచ్ఛమైన అనుబంధమే నిజమైన స్నేహం. ఎలాంటి స్వార్థం, షరతులు లేకుండా ఒకరికి ఒకరు అండగా నిలవడం, కష్టసుఖాల్లో తోడుగా ఉండడం స్నేహం గొప్పతనం. ప్రస్తుత వేగవంతమైన జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో మన భావాలను అర్థం చేసుకుని,...