సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న అసత్య ప్రాణాలను తిప్పిగొట్టిన

పత్రికాప్రకటన 20.07.2026, సోమాజిగూడ, ప్రెస్ క్లబ్, హైదరాబాద్. *నేను ఉపనిషత్ స్ఫూర్తికి భక్తుణ్ణి...* *విగ్రహానికి కాదు* విజయవిహారం రమణమూర్తి "నేను ఉపనిషత్తుల తాత్విక స్ఫూర్తికి కట్టుబడి మాట్లాడుతున్నాను. రాముడు కేంద్రంగా వున్నదే హిందూయిజంగా నేను అంగీకరించడం లేదంటే - రాముడిని దూషిస్తున్నానని ఎంతమాత్రం కాదు. నేను ద్వేషాన్ని అసమానతను వ్యతిరేకిస్తున్నాను. అది వేదాల్లో, ఇతిహాసాల్లో, పురాణాల్లో, ఖురాన్ లో, బైబిల్లో ఎక్కడున్నా సరే..."అని విజయవిహారం రమణమూర్తి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను జైశ్రీరామ్,...