Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 10:31 pm Posted by : జడల నాగప్రసాద్

సర్పంచ్ వెంకటరమణ మృతి..

భద్రాద్రి, జూలై 24 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతల బోరు గ్రామ పంచాయతీ సర్పంచ్ సోడే వెంకటరమణ శుక్రవారం భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే, వెంకటరమణ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, సీపీఎం నాయకులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను డిమాండ్ చేశారు. సర్పంచ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు విచారణ చేపట్టిన అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.