సంజీవని శక్తి కిట్లతో బీడీ కార్మికులకు అండ

దుబ్బాక ప్రతినిధి ఏప్రిల్ 24(వార్త సంధ్య ): బీడీ కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దుబ్బాక మండలం శివాజీ నగర్ తాండలో సంజీవని శక్తి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని టీమ్ కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ మహిళా బీడీ కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీడీలు చుట్టే మహిళలు కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నారని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు.సంజీవని...