సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి : ఏఐఎస్ఎఫ్
భద్రాద్రి, జూలై 06 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఏఐఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి...