Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 1:08 am Posted by : VARTHA SANDHYA DESK

షరీఫ్ రంగా‌కు ఖమ్మం జిల్లా అధ్యక్ష బాధ్యతలు

  • హైదరాబాద్‌ లో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం

 

సింగరేణి ప్రతినిధి, ఆగస్టు 10 (వార్త సంధ్య) : హైదరాబాద్‌ లో ఆంధ్ర–తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన ట్రస్ట్ సభ్యులు, అభిమానులు, నాయకులు హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన షేక్ షరీఫ్ పాషా (షరీఫ్ రంగా) ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా షేక్ షరీఫ్ పాషా (షరీఫ్ రంగా)ను నియమిస్తూ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి నియామక పత్రాన్ని అందజేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన షరీఫ్ రంగా‌కు పలువురు ట్రస్ట్ సభ్యులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వంగవీటి వారసులు, వంగవీటి శాంతన్ కుమార్ తనయుడు వంగవీటి జూనియర్ మోహన రంగా, షరీఫ్ రంగా‌ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా షరీఫ్ రంగా మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి గారికి, ట్రస్ట్ సభ్యులందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను ఒక పదవిగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ట్రస్ట్ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. ట్రస్ట్ నియమ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతానని షరీఫ్ రంగా స్పష్టం చేశారు. సమాజంలో అవసరమైన వారికి అండగా నిలవడం, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను చేపట్టడం, ట్రస్ట్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరవేయడం కోసం కృషి చేస్తానన్నారు. ఖమ్మం జిల్లాలో రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ట్రస్ట్ సభ్యులు, నాయకులు, అభిమానుల సహకారం తీసుకుంటానని తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించి, సాధ్యమైన మేరకు వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. భవిష్యత్తులో జిల్లాలో సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ట్రస్ట్‌ను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని షరీఫ్ రంగా పేర్కొన్నారు. నూతనంగా ఖమ్మం జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన షరీఫ్ రంగా‌కు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో ట్రస్ట్ సేవా కార్యక్రమాలు జిల్లాలో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.