Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 6:08 pm Posted by : sairamkodipyaka7@gmail.com

శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్

శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం

ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్

 

కామారెడ్డి, జూలై 12 (వార్త సంధ్య):

 

పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 6వ వార్డులో ఆదివారం ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఇప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని అన్నారు. వాతావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

 

అనంతరం అదనపు కలెక్టర్ గిరి మాట్లాడుతూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, హరిత వాతావరణాన్ని అందించాలంటే ఇలాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ నిట్టు గంగాధర్, శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సేవా ట్రస్ట్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.