Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 21 July 2026, 4:18 pm Posted by : sairamkodipyaka7@gmail.com

వనమహోత్సవంలో ఈతమొక్కలు నాటిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ

బ్రేకింగ్ న్యూస్

 

వనమహోత్సవంలో ఈతమొక్కలు నాటిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ

కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం సందర్భంగా కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో ఈత మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు.

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జులై 21  ( వార్తా సంధ్య)

ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ముకుంద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈతమొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

ఈత చెట్ల పెంపకం గౌడ కుల వృత్తిదారుల జీవనోపాధికి ఉపయోగకరమని, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజాప్రతినిధులు, గౌడ సంఘం నాయకులు మరియు సభ్యులు పాల్గొని ఈతమొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.