Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 10:38 pm Posted by : జడల నాగప్రసాద్

రోడ్డు ప్రమాదంలో భద్రాచలం టెంపుల్ ఇన్స్పెక్టర్ మృతి

భద్రాద్రి, జూలై 24 (వార్త సంధ్య) : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో టెంపుల్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న రామిరెడ్డి శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, భద్రాచలం నుంచి కూనవరం రహదారిపై ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా సీఆర్పీఎఫ్‌కు చెందిన వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామిరెడ్డిని వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.