రూ.2 లక్షల లంచం.. ఇరిగేషన్ ఏఈఈకి ఏసీబీ షాక్
భద్రాద్రి, జూన్ 29 (వార్త సంధ్య) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వరుసగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా అశ్వారావుపేటలో ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఎల్. శ్రీనివాస్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. వివరాల ప్రకారం, అశ్వారావుపేటకు చెందిన ఓ రైతు తన పొలంలో అశ్వారావుపేట పట్టణంలోని దొంతికుంట చెరువు నుంచి మట్టి తరలించేందుకు అనుమతి ఇవ్వాలంటే రూ.2 లక్షలు లంచం ఇవ్వాలని ఏఈఈ ఎల్....