సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రౌతు శ్రీకాంత్ ఏకగ్రీవ ఎన్నిక
కామారెడ్డి జిల్లా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా రౌతు శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజు, సూర స్రవంతి, మల్లం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు కొడిప్యాక సాయిరాం తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 6 ( వార్త సంధ్య )
సమాచార హక్కు చట్టంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, సంస్థను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని రౌతు శ్రీకాంత్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సంస్థ నాయకులు, సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.