Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 11:17 pm Posted by : జడల నాగప్రసాద్

రాంపురం లో ఘనంగా నూతన గృహ ప్రవేశం

  • ముఖ్య అతిథులుగా సర్పంచ్, ఉపసర్పంచ్రి
  • రిబ్బన్  కట్ చేసి గృహ ప్రారంభం
  • ఇంటి యజమానులకు శుభాకాంక్షలు
  • గ్రామ అభివృద్ధికి సహకరించాలని పిలుపు
  • భారీగా పాల్గొన్న గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు

 

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 1 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని రాంపురం గ్రామంలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బాధవత్ అనిత, ఉపసర్పంచ్ పులిచర్ల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటి యజమానులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, సామాజిక ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆనందోత్సాహాల నడుమ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.