రజక సంఘం నూతన అధ్యక్షుడిగా కంచర్ల స్వామి
దుబ్బాక ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రజక సంఘం నూతన అధ్యక్షుడిగా కంచర్ల స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా కారంకంటి వెంకటేష్, ఖజాంచీలుగా కంచర్ల ప్రవీణ్ మరియు కారంకంటి రాజు, ప్రధాన కార్యదర్శిగా కంచర్ల శివకుమార్, ప్రచార కార్యదర్శిగా కంచర్ల నాగరాజును సభ్యులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కంచర్ల స్వామి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు...