దుబ్బాక ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15: సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో రజక సంఘం నూతన అధ్యక్షుడిగా కంచర్ల స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా కారంకంటి వెంకటేష్, ఖజాంచీలుగా కంచర్ల ప్రవీణ్ మరియు కారంకంటి రాజు, ప్రధాన కార్యదర్శిగా కంచర్ల శివకుమార్, ప్రచార కార్యదర్శిగా కంచర్ల నాగరాజును సభ్యులు ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కంచర్ల స్వామి మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రజక సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.అనంతరం నూతన అధ్యక్షుడు కంచర్ల స్వామి మరియు నూతన పాలకవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రజక సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం కార్యవర్గ సభ్యులు వేణు, బాలకృష్ణ, శ్రీధర్, హరి, ప్రశాంత్, రవి తదితరులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.