మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే 

అన్నదాతల కష్టానికి తగిన ప్రతిఫలంరైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి భద్రాద్రి జిల్లా బ్యూరో, ఏప్రిల్ 28 (వార్త సంధ్య) : సుజాతనగర్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. వ్యవసాయాధారిత ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించిందని...