Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 02 July 2026, 7:06 pm Posted by : sairamkodipyaka7@gmail.com

మెదడు చికిత్సలు మరింత సులభం – అత్యాధునిక సాంకేతికతతో యశోద హాస్పిటల్ సేవలు

మెదడు చికిత్సలు మరింత సులభం – అత్యాధునిక సాంకేతికతతో యశోద హాస్పిటల్ సేవలు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 2 ( వార్త సంధ్య )

 

కామారెడ్డి పట్టణ కేంద్రంలోని యశోద హాస్పిటల్ ఓపీ సెంటర్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ న్యూరోసర్జన్ డాక్టర్ బీజే రాజేష్ మాట్లాడారు.

మెదడు సంబంధిత క్లిష్టమైన వ్యాధులకు యశోద హాస్పిటల్‌లో అత్యాధునిక సాంకేతికతతో చికిత్సలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా న్యూరోసర్జరీ విభాగంలో ఆపరేషన్ థియేటర్‌లోనే ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ (Intraoperative MRI) సౌకర్యం అందుబాటులో ఉందని చెప్పారు. ఈ సాంకేతికత ద్వారా మెదడులోని కణితుల వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలోనే ఎంఆర్ఐ స్కాన్ చేసి, కణితి పూర్తిగా తొలగించబడిందా లేదా అనేది వెంటనే నిర్ధారించుకోవచ్చని వివరించారు. అవసరమైతే అదే సమయంలో శస్త్రచికిత్సను కొనసాగించి మరింత ఖచ్చితత్వంతో చికిత్స అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

గత 20 సంవత్సరాలుగా దాదాపు 2,000కు పైగా మెదడు శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని, ఆధునిక సాంకేతికతతో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రోగికి పూర్తిగా మత్తు ఇవ్వకుండానే మెదడు శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనివల్ల రోగులకు మరింత భద్రతతో కూడిన చికిత్స అందుతుందని చెప్పారు.

కామారెడ్డి ప్రజల కోసం ప్రతి నెల మొదటి గురువారం యశోద హాస్పిటల్ ఓపీ సెంటర్‌లో న్యూరో వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలైన ముఖం వంకరగా మారడం, చేతులు లేదా కాళ్లు బలహీనపడటం, మాట తడబడటం, పక్షవాతం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే న్యూరో స్పెషలిస్ట్‌ను సంప్రదించాలని సూచించారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత తొలి మూడు గంటల్లోపు చికిత్స అందితే ప్రాణాపాయాన్ని తగ్గించడంతో పాటు శాశ్వత వైకల్యాన్ని కూడా నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ బీజే రాజేష్ తెలిపారు.