మారుతి సుజుకి ‘విక్టోరీస్’ కారును ప్రారంభించిన మధుయాష్కి గౌడ్

కర్మన్‌ఘాట్‌లో ఆదర్శ ఆటోమోటివ్స్ షోరూమ్‌లో ఆవిష్కరణ  ఎల్బీనగర్ , జూన్ 25, వార్త సంధ్య :  కర్మన్‌ఘాట్‌లోని మారుతి సుజుకి ఆదర్శ ఆటోమోటివ్స్ షోరూమ్‌లో నూతనంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘విక్టోరీస్’ కారును టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గురువారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ, ఆధునిక ఫీచర్లు, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సాంకేతిక సదుపాయాలతో విక్టోరీస్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ, వినియోగదారుల అభిరుచులు, అవసరాలను దృష్టిలో...