Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 9:46 am Posted by : VARTHA SANDHYA DESK

మారుతి సుజుకి ‘విక్టోరీస్’ కారును ప్రారంభించిన మధుయాష్కి గౌడ్

కర్మన్‌ఘాట్‌లో ఆదర్శ ఆటోమోటివ్స్ షోరూమ్‌లో ఆవిష్కరణ

 ఎల్బీనగర్ , జూన్ 25, వార్త సంధ్య :  కర్మన్‌ఘాట్‌లోని మారుతి సుజుకి ఆదర్శ ఆటోమోటివ్స్ షోరూమ్‌లో నూతనంగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ‘విక్టోరీస్’ కారును టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ గురువారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా షోరూమ్ నిర్వాహకులు మాట్లాడుతూ, ఆధునిక ఫీచర్లు, వినియోగదారుల అవసరాలకు అనుగుణమైన సాంకేతిక సదుపాయాలతో విక్టోరీస్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ, వినియోగదారుల అభిరుచులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని మార్కెట్లోకి తీసుకొచ్చే కొత్త మోడళ్లకు ఎప్పుడూ మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో కొత్త సాంకేతికతతో కూడిన వాహనాలు వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో చంపాపేట డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, గణేష్ నాయక్, అలాగే డేరంగుల కృష్ణ, రామకృష్ణారెడ్డి, గణేష్ రెడ్డి, రమాకాంత్, పూల నాగరాజు, నరేష్ గుప్తా, కొండోజు శ్రీనివాస్, అంతటి శ్రీనివాస్ గౌడ్, శశికాంత్, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.