గార్ల ప్రతినిధి, జూన్ 23 ( వార్త సంధ్య) : మండలంలోని పోచారం గ్రామానికి చెందిన మహిళా కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చౌటం కళావతి భర్త మల్లయ్య ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నూనవత్ రాధ సోమవారం వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కళావతి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాధ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దనియాకుల రామారావు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు రాజమ్మ, సరస్వతి, నిర్మలారెడ్డి, మేఘన తదితరులు పాల్గొన్నారు.