మతసామరస్యం తో ముందుకు సాగాలి: ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ సందేశం

హైదరాబాద్ సిటీ ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15 : హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రంజాన్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. రంజాన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది ఆత్మశుద్ధి చేసుకునే పవిత్ర సమయమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. మతసామరస్యం, సోదరభావంతో కలిసి మెలిసి జీవించడం సమాజానికి ఎంతో అవసరమని ఆయన అన్నారు....