మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేయాలని బహుజన సేన డిమాండ్
దళిత ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు.. కోమటిరెడ్డి బ్రదర్స్ క్షమాపణ చెప్పాలి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేయాలని బహుజన సేన డిమాండ్ హైదరాబాద్, జూలై 30 (వార్త సంధ్య): రాష్ట్రంలో ముఖ్యంగా నల్లగొండ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల పట్ల కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని బహుజన సేన విమర్శించింది. ముఖ్యంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌పై ఇటీవల జరిగిన వ్యాఖ్యలు, వ్యవహార శైలి అణచివేత, అవమానకర ధోరణికి నిదర్శనమని పేర్కొంది. గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో...