Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 10:29 am Posted by : జడల నాగప్రసాద్

మంత్రి, ఎంపీ నేటి పర్యటన వాయిదా

భద్రాద్రి, జూలై 16 (వార్త సంధ్య) : జూలై 16 కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో నిర్వహించాల్సిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రఘురామిరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొననున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ మేరకు కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కార్యక్రమానికి సంబంధించిన తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. కార్యక్రమానికి హాజరుకావాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేసింది.