భద్రాద్రి జిల్లాలో అర్ధరాత్రి భూకంపం….

జూన్ 14 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున 2:26 గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించడంతో నిద్రలో ఉన్న పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప ప్రకంపనల ప్రభావంతో ఇళ్లలోని ఫ్యాన్లు, కిటికీలు, తేలికపాటి వస్తువులు స్వల్పంగా కదిలినట్లు స్థానికులు తెలిపారు. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి...