Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 8:57 am Posted by : VARTHA SANDHYA DESK

బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్

భద్రాద్రి, జూలై, 16 (వార్త సంధ్య) : ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రుల పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన “చలో మణుగూరు” పిలుపుకు భయపడి కొత్తగూడెం నియోజకవర్గం లోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి. పోలీస్ స్టేషన్ ల లో నిర్భందించడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్య ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉందని, ప్రతిపక్ష నాయకుల గొంతులను పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలనే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని ఎంపీ రవిచంద్ర సూచించారు. చేస్తున్న ప్రయత్నాలకు ను ప్రజలు గమనిస్తున్నారు. సమాజంలో ప్రశ్నించే వారిని భయపెట్టడానికి… పోలీసులు చేసే ఇలాంటి చర్యలు ప్రతిపక్ష నాయకుల్లో మరింత కసిని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు. తక్షణమే పోలీసులు ఇలాంటి అరెస్టులు ఆపాలని, ఇప్పటికే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.