ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళులు
పేరుపల్లి గ్రామపంచాయతీలో జయంతి వేడుకలు సింగరేణి ప్రతినిధి, ఆగస్టు 06 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బానోతు పద్మావతి, కాంగ్రెస్ నాయకుడు మల్లెల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన త్యాగాలు, ఉద్యమానికి అందించిన దార్శనికత చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో...