Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 1:12 pm Posted by : govindhu13@gmail.com

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పదోన్నతుల అక్రమాలపై QGDLA ఆందోళన 

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పదోన్నతుల అక్రమాలపై QGDLA ఆందోళన

హైదరాబాద్, జూలై 22 (వార్త సంధ్య): తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పదోన్నతులు, సీనియారిటీ, సర్వీస్ రూల్స్, యూజీసీ నిబంధనల అమలులో గత రెండు దశాబ్దాలుగా జరిగిన అక్రమాలు, అసమానతలపై అర్హతగల ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం (QGDLA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలపై బుధవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. బాలయ్య మాట్లాడారు.

సంఘం వివరాల ప్రకారం, జి.ఓ.ఎం.ఎస్. నెం.159/1990, జి.ఓ.ఎం.ఎస్. నెం.280/1991 ప్రకారం జూనియర్ లెక్చరర్ నుంచి డిగ్రీ లెక్చరర్ (యూజీసీ స్కేల్ అసిస్టెంట్ ప్రొఫెసర్) పదోన్నతికి NET/SLET తప్పనిసరి అర్హతగా నిర్దేశించారని తెలిపారు. అనంతరం వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు, యూజీసీ నిబంధనలు కూడా ఇదే విధానాన్ని కొనసాగించాయని పేర్కొన్నారు.

అయితే, జి.ఓ.ఎం.ఎస్. నెం.61/2001 ప్రకారం భవిష్యత్ పదోన్నతులకు NET/SLET తప్పనిసరి చేసినప్పటికీ, 2006 వరకు మినహాయింపులు కొనసాగించి దాదాపు 1,300 మంది అర్హతలేని అభ్యర్థులకు పదోన్నతులు, యూజీసీ వేతన శ్రేణులు మంజూరు చేసినట్లు సంఘం ఆరోపించింది. 2003, 2005, 2006 డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (DPC) సమావేశాల్లో అర్హత కలిగిన అధ్యాపకులను విస్మరించారని పేర్కొంది.

జి.ఓ.ఎం.ఎస్. నెం.47/2007 ద్వారా NET/SLET తప్పనిసరి చేస్తూనే అర్హులైన M.Phil./Ph.D. అభ్యర్థులకు మినహాయింపు కల్పించినప్పటికీ, ఆ మినహాయింపును కొందరికే వర్తింపజేయడం వల్ల సమాన స్థితిలో ఉన్న అధ్యాపకుల మధ్య అసమానతలు ఏర్పడ్డాయని సంఘం తెలిపింది. అర్హులైన అభ్యర్థులకు ముందుగా పదోన్నతులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని గుర్తు చేసింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే నిబంధనలకు విరుద్ధంగా మంజూరైన పూర్వ తేదీ, నోషనల్ పదోన్నతులను సమీక్షించి చట్టవిరుద్ధంగా పొందిన ప్రయోజనాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. 2011 ప్రత్యక్ష నియామకుల ప్రిన్సిపాల్ పదోన్నతులను సమీక్షించి, 2010 బ్యాచ్ అర్హులైన అధ్యాపకుల పదోన్నతి హక్కులను పునరుద్ధరించాలని కోరింది.

అలాగే తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 ప్రకారం సమగ్ర సీనియారిటీ జాబితాను సవరించి, ఫీడర్ కేటగిరీ, ఇంటర్-సే సీనియారిటీని పరిరక్షించాలని, నకిలీ పీహెచ్.డి. డిగ్రీలను తిరస్కరించి సంబంధిత లబ్ధిదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

07-03-2022 ప్రభుత్వ మెమో, హైకోర్టు ఆదేశాలను అమలు చేసి అర్హులైన అధ్యాపకులకు నోషనల్ పదోన్నతులు, అన్ని సేవా ప్రయోజనాలు కల్పించాలని, యూజీసీ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, సర్వీస్ రూల్స్‌కు విరుద్ధంగా జరిగిన పదోన్నతులు, సీనియారిటీ సవరణలు, ప్రిన్సిపాల్ పదోన్నతులపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసి అక్రమాలు రుజువైతే తగిన చర్యలు తీసుకోవాలని సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

అన్ని పదోన్నతులు, సీనియారిటీ అంశాల్లో యూజీసీ నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వులు, సర్వీస్ రూల్స్, న్యాయస్థానాల ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తూ న్యాయం, పారదర్శకత, సమానత్వం పాటించాలని, అర్హత కలిగిన అధ్యాపకుల చట్టబద్ధమైన పదోన్నతి హక్కులను పరిరక్షించాలని QGDLA ప్రభుత్వాన్ని వి

జ్ఞప్తి చేసింది.