పేదలకు అండగా ప్రభుత్వం – సీఎంఆర్ఎఫ్ చెక్కు

రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే పాయం భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 23 (వార్త సంధ్య) : పేద మరియు అవసరమైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య, ఆర్థిక సహాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సూచించారు. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మణుగూరు మండలం విట్టల్‌రావు నగర్‌కు చెందిన ఈర్ల ఉమారాణికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును అందజేశారు. అదేవిధంగా, పినపాక మండలం జానంపేట...