పాల్వంచలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడేళ్ల చిన్నారి మృతి
భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 10 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ సమీపంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీలను ఓ కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని స్థానికులు వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వారు...