పట్టణ స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికులు: మున్సిపల్ ఛైర్మన్ కట్కం రవీందర్

జగిత్యాల జిల్లా బ్యూరో (వార్త సంధ్య) – ఫిబ్రవరి 15: పారిశుద్ధ్య కార్మికులు పట్టణ స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ కట్కం రవీందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్లను శుభ్రపరచి ప్లాస్టిక్ వినియోగం నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు పంపిణీ చేశారు. అలాగే ఏర్పాటు చేసిన వైద్య...