Vaarthasandhya
Newspaper Banner
Date of Publish : 15 March 2026, 7:36 pm Posted by : VARTHA SANDHYA DESK

పట్టణ స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికులు: మున్సిపల్ ఛైర్మన్ కట్కం రవీందర్

జగిత్యాల జిల్లా బ్యూరో (వార్త సంధ్య) – ఫిబ్రవరి 15: పారిశుద్ధ్య కార్మికులు పట్టణ స్వచ్ఛత కోసం నిరంతరం శ్రమిస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ కట్కం రవీందర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్లను శుభ్రపరచి ప్లాస్టిక్ వినియోగం నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.అనంతరం మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు పంపిణీ చేశారు. అలాగే ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కార్మికులకు షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమని అన్నారు. అందుకే వారికి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, అందరూ దాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

పారిశుద్ధ్య కార్మికులు పట్టణ స్వచ్ఛత కోసం కష్టపడుతున్నారని, వారి ఆరోగ్యం మరియు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పని సమయంలో భౌతిక గాయాలు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందేందుకు అందించిన వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు, వైస్ ఛైర్మన్ తురగ సౌజన్య, కౌన్సిలర్లు పుర్రె శ్రీధర్, రాకేష్, వైద్యులు డాక్టర్ అనిల్, మేనేజర్ వెంకటి, నాయకులు తురగ శ్రీధర్, మచ్చ శేఖర్, తోపారపు సురేష్, వేముల రాము, వార్డు అధికారులు ప్రత్యూష, వైద్య సిబ్బంది సంతోష్, రమ, వరలక్ష్మి, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.